: నెహ్రూ కుటుంబం అడుగుజాడల్లో నడుస్తున్న కేసీఆర్: రేవంత్ రెడ్డి
ఎన్నికల సర్వే సంస్థలపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు దర్యాప్తు జరపాలని టీడీపీ నేత రేవంత్ రెడ్డి అన్నారు. తప్పుడు సర్వేలు నిర్వహించే వారిని సంఘం నుంచి బహిష్కరించాలని కోరారు. వైఎఎస్సార్సీపీ తన అక్రమ డబ్బుతో తప్పుడు సర్వేలు చేయిస్తూ, సర్వే సంస్థల విశ్వసనీయతను దెబ్బతీస్తోందని ఆరోపించారు. ఇదే సమయంలో కేసీఆర్ పై కూడా రేవంత్ రెడ్డి విరుచుకుపడ్డారు. తెలంగాణ రాష్ట్రానికి దళితుడినే మొదటి ముఖ్యమంత్రిని చేస్తామన్న కేసీఆర్ ఇప్పుడు ఆ విషయంపై మౌనం వహించారని తెలిపారు. నెహ్రూ కుటుంబీకుల అడుగుజాడల్లో నడుస్తున్న కేసీఆర్... తమ కుటుంబ సభ్యులను అందలం ఎక్కించడానికి ప్రయత్నిస్తున్నారని విమర్శించారు.