: కుమార్తె స్నేహితురాలిపై ఫొటోగ్రాఫర్ అత్యాచారం


ఢిల్లీలో దారుణం చోటు చేసుకుంది. 19 ఏళ్ళ ఫ్యాషన్ డిజైనింగ్ విద్యార్థినిపై ఆమె స్నేహితురాలి తండ్రే అత్యాచారం చేశాడు. ఈ ఘటన ఫిబ్రవరి 13న చాణక్యపురి జింఖానా క్లబ్ లో చోటుచేసుకోగా, బాధిత యువతి ఘటనపై ఈ నెల 19న పోలీసులకు ఫిర్యాదు చేసింది. తన స్నేహితురాలి తండ్రి సందీప్ కోహ్లీ తనకు ఫోన్ చేసి... పనుందని, జింఖానా క్లబ్ కు రావాలని చెప్పాడని తెలిపింది. అక్కడికెళ్ళిన తనపై లైంగిక దాడి చేశాడని వివరించింది. విషయం ఎవరికైనా చెబితే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుందని హెచ్చరించాడని తెలిపింది. కాగా, సందీప్ కోహ్లీ లక్నోలో ఓ ఫొటోగ్రాఫర్. ప్రస్తుతం అతడికోసం పోలీసు బృందాలను లక్నో పంపారు. అయితే అతడి ఆచూకీ లభ్యం కాలేదు.

  • Loading...

More Telugu News