: రైలు బండి వెళ్లిపోతే.. టికెట్ చార్జీ వాపసు రానట్లే!
ఉరుకులు పరుగులతో ప్రయాస పడుతూ రైల్వే స్టేషన్ కు చేరుకున్నారు. కొద్దిలో రైలు బండి వెళ్లిపోయింది. చేసేది లేక రిజర్వేషన్ కౌంటర్ కు వెళ్లి టికెట్ కేన్సిల్ చేసుకుని సగం సొమ్ము వాపసు తీసుకుని వెళ్లిపోతారు. అయితే, మార్చి 1 నుంచి ఆ సదుపాయం కూడా ఉండదు. రైలు మిస్సయితే రూపాయి ఇవ్వరు. క్షణం ఆలోచన లేకుండా ఇంటిముఖం పట్టవచ్చు. అంతేకాదు, ఇద్దరు, లేదా ముగ్గురి పేర్లతో ఒకే టికెట్ తీసుకున్నారనుకోండి. వారిలో ఎవరైనా ప్రయాణం రద్దు చేసుకున్నా సరే, ఇకపై ఆ టికెట్ చార్జీకి నీళ్లొదులుకోవాల్సిందే. మార్చి 1 నుంచి ఈ మేరకు కొత్త నిబంధనలు అమల్లోకి రానున్నాయి.