: శ్రీశైలంలో గజవాహనంపై విహరిస్తున్న భ్రమరాంబికా దేవి, మల్లికార్జున స్వామి
ప్రముఖ పుణ్యక్షేత్రమైన శ్రీశైలంలో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు అత్యంత వైభవంగా జరుగుతున్నాయి. ఏడో రోజుకు చేరుకున్న బ్రహ్మోత్సవాల్లో ఇవాళ (బుధవారం) సాయంత్రం గజవాహనంపై ఆసీనురాలైన భ్రమరాంబికా దేవి... మల్లికార్జునస్వామితో కలసి విహరిస్తున్నారు. స్వర్ణాలంకార భూషితురాలైన అమ్మవారిని అధిక సంఖ్యలో భక్తులు దర్శించుకున్నారు. గురువారం మహాశివరాత్రి పర్వదినం కావడంతో శ్రీశైలానికి భక్తుల రద్దీ పెరిగింది. హర హర శంభో శంకర అంటున్న భక్త జనకోటితో శ్రీశైల గిరులు మార్మోగుతున్నాయి.