: జయలలితపై ధ్వజమెత్తిన స్టాలిన్


తమిళనాడు సీఎం జయలలితపై డీఎంకే నేత స్టాలిన్ ధ్వజమెత్తారు. ఎన్నికల సంఘం ఇంకా షెడ్యూల్ ప్రకటించకముందే జయ హడావుడిగా తన పార్టీ లోక్ సభ అభ్యర్థులను ప్రకటించడం వెనుక కుట్ర దాగి ఉందని ఆరోపించారు. అక్రమాస్తుల కేసుల విచారణను తప్పించుకునేందుకే జయ ఏఐఏడీఎంకే అభ్యర్థుల జాబితాను విడుదల చేశారని స్టాలిన్ అన్నారు. ఈ కేసుపై బెంగళూరులోని ప్రత్యేక కోర్టులో విచారణ జరుగుతోంది. ప్రచారం, ఇతరత్రా కారణాలు సాకుగా చూపి విచారణకు హాజరుకారాదనే సీఎం భావిస్తున్నట్టుందని విమర్శించారు. ఇక, వచ్చే ఎన్నికల్లో తాము విజయ్ కాంత్ పార్టీ డీఎండీకే, కాంగ్రెస్ పార్టీలతో పొత్తు పెట్టుకోబోమని స్పష్టం చేశారు. పొత్తు తలుపులు ఎప్పుడో మూసివేశామని తెలిపారు. చెన్నైలో నేడు జరిగిన ఓ వివాహ కార్యక్రమంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.

  • Loading...

More Telugu News