: భారత్ విజయ లక్ష్యం 280


ఆసియా కప్ రెండో మ్యాచ్ లో బంగ్లాదేశ్ జట్టు నిలకడైన ఆటతీరు కనబరిచింది. టాపార్డర్ రాణించడంతో బంగ్లాదేశ్ జట్టు యువభారత జట్టుకు 280 పరుగుల విజయ లక్ష్యాన్ని నిర్దేశించింది. బౌలర్లు భువనేశ్వర్, జడేజా, ఆరోన్, అశ్విన్ విఫలమవ్వడంతో బంగ్లాదేశ్ జట్టు ఆటగాళ్లు సొంతగడ్డపై నిలకడగా ఆడుతూ రాణించారు. కెప్టెన్ ఇన్నింగ్స్ తో 117 పరుగులు చేసి ముష్పికర్ రాణించడంతో బంగ్లాదేశ్ నిర్ణీత 50 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 279 పరుగులు చేసింది. భారత బౌలర్లలో షమి ఒక్కడే రాణించి నాలుగు వికెట్లు తీశాడు. కాసేపట్లో భారత జట్టు 280 పరుగుల విజయ లక్ష్యంతో బ్యాటింగ్ ప్రారంభించనుంది.

  • Loading...

More Telugu News