: పాపం పెళ్లి రోజే జైలుపాలైన పెళ్లి కొడుకులు


కట్నంపై ఆశ పెళ్లి కొడుకుల కొంపముంచింది. పెళ్లి రోజే ఇద్దరు పెళ్లి కొడుకులు జైల్లో గడిపారు. ఉత్తరప్రదేశ్ లోని మధురకు చెందిన ఇద్దరు అక్కాచెల్లెళ్లకు కుర్సందా గ్రామానికి చెందిన రవి, అజిత్ అనే అన్నదమ్ములతో పెళ్లిళ్లు జరపాలని పెద్దలు నిశ్చయించారు. పెళ్లి మండపానికి చేరుకున్న ఇద్దరు పెళ్లి కొడుకులు అదనపు కట్నంగా లక్ష రూపాయలు ఇవ్వాలని, మోటార్ సైకిల్ ఇవ్వాలని గొడవ చేశారు. దీంతో ఇరు వర్గాలకు మధ్య ఘర్షణ చోటు చేసుకుని ఆరుగురు వ్యక్తులు తీవ్రంగా గాయపడ్డారు. వారిని ఒప్పించడానికి చాలా ప్రయత్నించారు అక్కడి పెద్దలు. ఎంతకీ రాజీ కుదరకపోవడంతో వధువుల తల్లి పోలీసులకు సమాచారమందించింది. దీంతో, కేసు నమోదు చేసిన పోలీసులు పెళ్లి కొడుకులను జైల్లో వేసి కేసు దర్యాప్తు చేస్తున్నారు.

  • Loading...

More Telugu News