: నిలకడగా ఆడుతున్న బంగ్లాదేశ్
భారత్ తో ఆసియాకప్ లీగ్ మ్యాచ్ లో బంగ్లాదేశ్ నిలకడగా ఆడుతోంది. టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న భారత్ కు పేసర్ షమి శుభారంభం అందించాడు. ఓపెనర్ షంసుర్ రహ్మాన్ ను 7 పరుగులకే పెవిలియన్ బాట పట్టించాడు. అనంతరం మొమినుల్ హక్ (23), ఓపెనర్ అనాముల్ హక్ (59 బ్యాటింగ్), కెప్టెన్ ముష్ఫికర్ రహీమ్ (42 బ్యాటింగ్) రాణించడంతో బంగ్లా జట్టు 31 ఓవర్లు ముగిసేసరికి రెండు వికెట్ల నష్టానికి 142 పరుగులు చేసింది.