: అధికార ప్రతిపక్షాలు కుమ్మక్కు కారణంగా రాష్ట్రం సమైక్యంగా ఉంచలేకపోయాం: జగన్
అధికార ప్రతిపక్షాల కుమ్మక్కు కారణంగా రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచలేకపోయామని వైఎస్సార్సీపీ అధినేత జగన్ అన్నారు. హైదరాబాదులో ఆయన మాట్లాడుతూ, భావోద్వేగాల మధ్య ఎన్నికలకు వెళ్తున్నామన్నారు. 'మంచి చేశాం ఓట్లేయండి' అని చెప్పలేక, 'రాష్ట్రాన్ని విడగొట్టాం ఓట్లేయండి' అని అడగడానికి వెళ్తున్నారని అన్నారు. పెద్దమ్మ అని ఒకరు, చిన్నమ్మ అని మరొకరు పోటీ పడి రాష్ట్రాన్ని ముక్కలు చేశారని మండిపడ్డారు. రాష్ట్రాన్ని విడగొట్టాం కనుక ఓట్లేయండి అంటూ నిస్సిగ్గుగా ప్రజల ముందుకు వెళ్తున్నారని ఆయన మండి పడ్డారు.