: మందిరాల వద్ద ప్రార్థనలపై స్పష్టమైన విధానం ప్రకటించండి: జేపీ
మతాలతో సంబంధం లేకుండా మందిరాల వద్ద పార్థనల మీద ప్రభుత్వం ఒక స్పష్టమైన విధానం ప్రకటించాలని లోక్ సత్తా అధినేత జయప్రకాష్ నారాయణ అన్నారు. ప్రార్థనల పేరుతో సమయం సందర్భం లేకుండా రాత్రనకా పగలనకా ప్రజలకు తీవ్ర ఇబ్బందులు కలిగిస్తున్నారన్నారు. ధ్వనికాలుష్యం వల్ల ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని జేపీ శాసనసభలో మాట్లాడుతూ చెప్పారు.
మతాలతో నిమిత్తం లేకుండా రోడ్లకు అడ్డంగా నిర్మిస్తోన్న దేవాలయాలమీదా ప్రభుత్వం ఒక స్ఫష్టమైన విధానం ప్రకటించాలని జేపీ డిమాండ్ చేశారు. అక్బరుద్దీన్ ప్రసంగం నేపధ్యంలో జేపీ ఈ వ్యాఖ్యలు చేశారు.