: వైఎస్సార్సీపీ నేతపై బాంబులతో దాడి
కడప జిల్లాలో వైఎస్సార్సీపీ నేత సుధాకర్ రెడ్డిపై ఈ తెల్లవారుజామున బాంబులతో దాడి జరిగింది. లింగాల మండలం గునకలపల్లిలో ఆయన ప్రత్యర్థులు దాడికి పాల్పడ్డారు. ఈ ఘటనలో ఆయన ప్రాణాలతో తృటిలో తప్పించుకోగా, మరో ఇద్దరు మాత్రం గాయపడ్డారు. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. ఈ దాడికి సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.