: 'రా' మాజీ చీఫ్ సంజీవ్ త్రిపాఠి బీజేపీలో చేరిక
భారత నిఘా విభాగం 'రీసెర్చ్ అండ్ అనాలసిస్ వింగ్' (రా) మాజీ చీఫ్ సంజీవ్ త్రిపాఠి బీజేపీలో చేరారు. ఢిల్లీలో జరిగిన ఓ కార్యక్రమంలో త్రిపాఠికి బీజేపీ జాతీయ అధ్యక్షుడు రాజ్ నాథ్ సింగ్ పార్టీ సభ్యత్వం అందించారు. బీజేపీ ద్వారానే మార్పు సాధ్యమని త్రిపాఠి నమ్మారని, అందుకే తమ పార్టీలో చేరారని రాజ్ నాథ్ చెప్పారు. కాగా, త్రిపాఠి 1972 బ్యాచ్ ఐపీఎస్ అధికారి. 2010-2012 మధ్య కాలంలో 'రా' చీఫ్ గా బాధ్యతలు నిర్వర్తించారు.