: దిగ్విజయ్ తో ముగిసిన సీమాంధ్ర కాంగ్రెస్ నేతల సమావేశం


రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ ఛార్జ్ దిగ్విజయ్ సింగ్ తో సీమాంధ్ర కాంగ్రెస్ నేతల సమావేశం ముగిసింది. ఢిల్లీ వార్ రూమ్ లో దాదాపు గంటకుపైగా ఈ భేటీ వాడీవేడిగా జరిగింది. కేంద్ర మంత్రి జైరాం రమేశ్, కాంగ్రెస్ సీనియర్ నేత మోతీలాల్ వోరా, కావూరి, కోట్ల, తదితరులు పాల్గొన్నారు. విభజన ఫలితంగా సీమాంధ్రలో పార్టీ కొంత ప్రాభవం కోల్పోనున్న నేపథ్యంలో భవిష్యత్ ప్రచారంపై ముఖ్యంగా చర్చించుకున్నారు. ఇక కొత్త సీఎం, వచ్చే ఎన్నికలు, పలు విషయాలపై మాట్లాడినట్లు తెలుస్తోంది.

  • Loading...

More Telugu News