: రేపు కోహ్లీకి తొలి పరీక్ష


యువ కెప్టెన్ విరాట్ కోహ్లీ నేతృత్వంలో రేపు టీమిండియా ఆతిథ్య బంగ్లాదేశ్ తో ఆసియా కప్ లీగ్ మ్యాచ్ ఆడనుంది. ఫతుల్లా వేదికగా జరిగే ఈ మ్యాచ్ లో నెగ్గి శుభారంభం చేయాలని ఇరు జట్లు భావిస్తున్నాయి. ఓ టోర్నీలో భారత్ కు నాయకత్వం వహిస్తుండడం కోహ్లీకిదే తొలిసారి. విజయంతో ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఈ ఢిల్లీ స్టార్ భావిస్తున్నాడు. చివరిసారిగా ఈ రెండు జట్లు ఓ వన్డేలో తలపడింది 2012 ఆసియా కప్ లోనే. ఆ మ్యాచ్ లో బంగ్లా జట్టునే విజయం వరించింది. బ్యాటింగ్ మ్యాస్ట్రో సచిన్ టెండూల్కర్ కెరీర్లో 100వ సెంచరీ సాధించింది ఆ మ్యాచ్ లోనే కావడం విశేషం. ఆ పోరులో 290 పరుగుల లక్ష్యాన్ని బంగ్లా జట్టు విజయవతంగా ఛేదించింది. ఆ మ్యాచ్ స్ఫూర్తిగా రేపటి మ్యాచ్ లో బరిలో దిగుతామని బంగ్లా కెప్టెన్ ముష్ఫికర్ రహీమ్ అంటున్నాడు.

  • Loading...

More Telugu News