: సల్మాన్ కేసులో మార్చి నుంచి తాజా విచారణ
ముంబయిలోని బాంద్రా ప్రాంతంలో ఫుట్ పాత్ పై నిద్రపోతున్న వారిపై వేగంగా కారు నడిపి ఓ వ్యక్తి మరణానికి, కొందరికి తీవ్ర గాయాలయ్యేందుకు కారణమైన నటుడు సల్మాన్ ఖాన్ కేసులో మార్చి 26 నుంచి తాజా విచారణ ప్రారంభం కానుంది. ఈ మేరకు తేదీని నిర్ణయించినట్లు ముంబయి సెషన్స్ కోర్టు పేర్కొంది. ఈ కేసులో ఇప్పటికే 17 మందిని సాక్షులుగా ప్రాసిక్యూషన్ పేర్కొంది. ఈ కేసులో 2005 నుంచి కోర్టులో విచారణ కొనసాగుతోంది. అయితే, కొత్తగా విచారణ ప్రారంభించాలని సల్మాన్ కోర్టుకు విజ్ఞప్తి చేయడంతో తాజా విచారణ మొదలుకానుంది.