: దొనకొండలో ఊపందుకుంటున్న రియల్ ఎస్టేట్
‘ప్రకాశం జిల్లాలో ఆంధ్రప్రదేశ్ రాజధాని’ అంటూ దొనకొండ పేరు వినవస్తుండటంతో... అక్కడ రియల్ ఎస్టేట్ వ్యాపారుల కన్ను పడింది. దాంతో దొనకొండ ప్రాంతంలో భూముల ధరలు రెండు నుంచి మూడు రెట్లు పెరిగాయి. హైదరాబాదు, విజయవాడ, రాజమండ్రి తదితర ప్రాంతాల నుంచి రియల్టర్లు అక్కడి భూములను పరిశీలిస్తున్నారు. దొనకొండ నుంచి దర్శి, పొదిలి, కురిచేడు వెళ్లే రోడ్డులో రియల్ ఎస్టేట్ వెంచర్లు వేస్తే బాగుంటుందనే అభిప్రాయాన్ని రియల్టర్లు వ్యక్తం చేశారు. వారం రోజుల క్రితం ఎకరం ధర రూ. 3-4 లక్షలుండగా, ఇప్పుడు ఆ ధర 10 లక్షల రూపాయలకు పెరిగింది. ఊరికి దూరంగా ఉండే ప్రాంతాల్లో కూడా ఎకరం లక్ష నుంచి నాలుగు లక్షలకు పెరిగింది.