: ఆ రహదారిని వాహనదారులు వాడుకోవచ్చు: ఆర్మీ


సికింద్రాబాదులోని ఏవోసీ సెంటర్ గేటును మూసివేస్తామని ఆర్మీ అధికారులు ప్రకటించడంతో పరిసర కాలనీ వాసుల్లో ఆందోళన నెలకొంది. ఈ నేపథ్యంలో కాలనీ సంఘాలు, పోలీసులు, స్థానిక నేతలతో ఆర్మీ అధికారులు ఈ విషయమై చర్చించారు. తమ నివాసాలకు దారి వదలాలని, వారు ఆర్మీ ఉన్నతాధికారులకు విన్నవించుకున్నారు. ఏవోసీ సర్కిల్ మూసివేస్తే తమకు ఇబ్బందులు తప్పవని స్థానికులు చెప్పడంతో ఆర్మీ అధికారులు సానుకూలంగా స్పందించారు. ఏవోసీ సెంటర్ గేటు మూసివేత నిర్ణయాన్ని తాత్కాలికంగా ఉపసంహరిస్తున్నట్లు ప్రకటించారు. ఏవోసీ గేటు నుంచి కాలనీ వాసుల వాహనాలను అనుమతించనున్నట్లు తెలపడంతో సికింద్రాబాదు వాసులు ఊపిరి పీల్చుకున్నారు.

  • Loading...

More Telugu News