: కేరళ మ్యూజియం నుంచి రోబో అదృశ్యం


చోరులు చివరికి రోబోలను కూడా వదిలేట్టులేరు! కేరళ రాజధాని తిరువనంతపురంలో ఉన్న కేరళ సైన్స్ అండ్ టెక్నాలజీ మ్యూజియంలో ఉన్న ఓ బుల్లి రోబో అదృశ్యమైంది. మ్యూజియంలోని ప్రియదర్శిని ప్లానెటోరియంలో ప్రదర్శనకు ఉంచిన ఈ రోబో ముందుకు వెనుకకు నడవడమే గాకుండా, తన చుట్టు తాను గిరగిరా తిరగ్గలదు. నిర్ణీత పరిధిలో మాత్రమే సంచరించే ఈ రోబో ఎంత చిన్నదంటే అరచేతిలో దీన్ని నిలపవచ్చు. గత శుక్రవారం గ్యాలరీలో ఈ రోబో కనిపించకపోవడంతో అధికారులు ఆందోళన చెందారు. వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేశారు. సిబ్బంది కొరత కారణంగానే మ్యూజియంలో ఇలాంటి ఘటనలు జరుగుతున్నాయని మ్యూజియం డైరక్టర్ అరుళ్ ప్రకాశ్ తెలిపారు. ప్రస్తుతం పోలీసులు ఈ రోబో ఆచూకీ కనిపెట్టే పనిలో నిమగ్నమయ్యారు.

  • Loading...

More Telugu News