: సూర్యప్రభ వాహనంపై విహరించిన కల్యాణ వేంకటేశ్వరుడు


తిరుపతి సమీపంలోని శ్రీనివాస మంగాపురంలో కొలువైన కల్యాణ వేంకటేశ్వరుని వార్షిక బ్రహ్మోత్సవాలు కన్నుల పండువగా సాగుతున్నాయి. ఇవాళ (మంగళవారం) స్వామివారు పంచాయుధాలు ధరించి సూర్యప్రభ వాహనంపై తిరువీధుల్లో విహరించారు. సూర్యప్రభపై ఆసీనులైన శ్రీవారిని అధిక సంఖ్యలో భక్తులు దర్శించుకున్నారు. అనంతరం పరిణయ మండపంలో శ్రీదేవి, భూదేవి అమ్మవార్లు, స్వామివారి ఉత్సవ విగ్రహాలకు తిరుమంజనం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి టీటీడీ ఉన్నతాధికారులు హాజరయ్యారు.

  • Loading...

More Telugu News