: కౌరవులపై పాండవులు గెలిచినట్టే...!: హరీశ్ రావు
ఆనాడు మహాభారతంలో కౌరవులపై పాండవులు గెలిచారు. అలాగే ఈనాడు తెలంగాణ ప్రజలు విజయం సాధించారని టీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు వ్యాఖ్యానించారు. ఈరోజు మెదక్ లో ఆయన మీడియాతో మాట్లాడారు. తమతో కలిసి ఉండేవారంతా తమవాళ్లే అని ఆయన పునరుద్ఘాటించారు. అయితే పెత్తనాన్ని మాత్రం ఒప్పుకొనేది లేదని ఆయన చెప్పారు. తెలంగాణ పునర్నిర్మాణంలో కూడా టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ భాగం కావాలని తెలంగాణ ప్రాంత ప్రజలు కోరుకుంటున్నారని హరీష్ రావు చెప్పారు.