: సర్పంచ్ ను కాల్చి చంపిన మావోయిస్టులు
విశాఖపట్నం జిల్లాలో మావోయిస్టులు మరోసారి తమ ఉనికిని చాటుకునే ప్రయత్నం చేశారు. చింతపల్లి మండలం బలపం సర్పంచ్ చింపల్లి కర్లాని గత అర్ధరాత్రి కిడ్నాప్ చేసిన మావోలు... రాళ్లగడ్డ స్థూపం వద్ద అతన్ని కాల్చి చంపారు. తమ హెచ్చరికలను ఖాతరు చేయకుండా, ఎన్నికల్లో పాల్గొన్నందుకే హత్య చేసినట్టు అక్కడ వదిలిన లేఖలో పేర్కొన్నారు. ఈ హత్యోదంతంతో విశాఖ ఏజన్సీలో భయాందోళనలు నెలకొన్నాయి.