: బ్యాట్ తో బెదిరించిన గౌతం గంభీర్


చేతిలో బ్యాటు ఉంది కదా అని బెదిరించకూడదు కదా? కానీ, గౌతం గంభీర్ ఇదే చేశాడు. సోమవారం ఢిల్లీలోని ఫిరోజ్ షా కోట్ల మైదానంలో ప్రాక్టీస్ మ్యాచ్ సందర్భంగా క్యూరేటర్ వెంకట్.. పిచ్ పొడిగా ఉందని నీళ్లు చల్లాలంటూ తన సిబ్బందికి ఆదేశాలు ఇవ్వగా.. వద్దంటూ గౌతంగంభీర్ సూచించడంతో వీరిద్దరి మధ్య ఘర్షణ జరిగింది. ఆ కోపంలో చేతిలో ఉన్న బ్యాట్ తో గంభీర్ వెంకట్ ను బెదిరించాడు. దీంతో గంభీర్ ప్రవర్తనపై ఢిల్లీ క్రికెట్ అసోసియేషన్ కు వెంకట్ ఫిర్యాదు చేశాడు. పిచ్ ల విషయంలో గంభీర్ క్యూరేటర్లతో గొడవపడడం ఇదే మొదటిసారి కాదు.

  • Loading...

More Telugu News