: జేసీ బ్రదర్స్ కు చంద్రబాబు గ్రీన్ సిగ్నల్?


అనంతపురం జిల్లా కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత జేసీ దివాకర్ రెడ్డి, ఆయన సోదరుడు ప్రభాకరరెడ్డిలు టీడీపీలో చేరడానికి ఆ పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు తెలుస్తోంది. ఈరోజు తాడిపత్రి నియోజకవర్గ కార్యకర్తలతో చంద్రబాబు భేటీ అయ్యారు. ఈ సందర్భంలో ఆయన పార్టీ పరిస్థితులపై చర్చించారు. అయితే అనంతపురం లోక్ సభ టికెట్ ఆశిస్తున్న ప్రభాకర్ రెడ్డి విషయంలో చిన్న మెలిక పెట్టినట్టు తెలుస్తోంది. దివాకర్ రెడ్డికి అనంతపురం ఎంపీ టికెట్, ప్రభాకర్ రెడ్డికి తాడిపత్రి ఎమ్మెల్యే టికెట్ ఇస్తానని చంద్రబాబు ఆఫర్ ఇచ్చినట్టు సమాచారం. జేసీ బ్రదర్స్ సైకిల్ ఎక్కడాన్ని మొదట్నుంచి వ్యతిరేకిస్తున్న పరిటాల సునీత, కాల్వ శ్రీనివాసులును కూడా ఇప్పటికే చంద్రబాబు బుజ్జగించినట్టు తెలుస్తోంది.

  • Loading...

More Telugu News