: ఓ ర్యాంకు ఎగబాకిన విరాట్ కోహ్లీ
టీమిండియా తాత్కాలిక కెప్టెన్ విరాట్ కోహ్లీ ఐసీసీ టెస్టు ర్యాంకుల్లో ఓ స్థానం ఎగబాకాడు. గతవారం ఐసీసీ విడుదల చేసిన బ్యాటింగ్ ర్యాంకుల జాబితాలో 9వ ర్యాంకు సాధించిన కోహ్లీ.. తాజా ర్యాంకుల్లో 8వ స్థానంలో నిలిచాడు. ఈ ఢిల్లీ స్టార్ కిది కెరీర్ బెస్ట్. ఇక, యువ బ్యాట్స్ మన్ చటేశ్వర్ పుజారా ఏడోస్థానంలో కొనసాగుతున్నాడు. టాప్ టెన్ లో ఉన్న భారత బ్యాట్స్ మెన్ వీరిద్దరే. ఈ జాబితాలో సఫారీ వీరుడు ఏబీ డివిలీర్స్ అగ్రస్థానాన్ని పదిలం చేసుకున్నాడు.