: ఉక్రెయిన్ అధ్యక్షుడిపై అరెస్ట్ వారెంట్ జారీ
ఉక్రెయిన్ అధ్యక్షుడు విక్టర్ యనుకోవిచ్ పై అరెస్ట్ వారెంట్ జారీ అయిందని ఆ దేశ అంతర్గత వ్యవహారాల మంత్రి ఆర్సెన్ అవఖోవ్ తెలిపారు. సామాన్య పౌరులను పలు సందర్భాల్లో ఊచకోత కోసినట్టు అధ్యక్షుడితోపాటు పలువురు అధికార ప్రముఖులపైనా ఆరోపణలు వెల్లువెత్తాయి. దీనిపై దేశంలో ఆందోళనలు మిన్నంటాయి. యనుకోవిచ్ పై విచారణ జరపాల్సిందేనని వివిధ వర్గాలు పట్టుబట్టాయి. ప్రస్తుతం యనుకోవిచ్ అజ్ఞాతంలోకి వెళ్ళిపోయారు. చివరిసారిగా క్రిమియా ప్రాంతంలో ఆయన ఆచూకీ లభ్యమైనట్టు ఉక్రెయిన్ వర్గాలు తెలిపాయి. అనంతరం ఆయన ఎక్కడ ఉన్నదీ తెలియరాలేదు.