: రాఖీ సావంత్ పై రాజకీయ పార్టీల చూపు!


బాలీవుడ్ ఐటం గర్ల్ రాఖీ సావంత్ కోసం రాజకీయ పార్టీలు గాలం వేస్తున్నాయి. తనకు పలు రాజకీయ పార్టీల నుంచి ఆఫర్లు వచ్చాయని ఆమే స్వయంగా వెల్లడించడం విశేషం. కానీ, ఇంకా ఏమీ నిర్ణయించుకోలేదని స్పష్టం చేసింది. ఆదివారం బీహార్ లోని చాప్రాకు వచ్చిన సందర్భంగా ఆమె మీడియాతో మాట్లాడుతూ.. మరాఠీ, బీహారీ ప్రజల మధ్య ఉన్న అంతరాన్ని తొలగించాలన్నది తన ఆశయంగా వెల్లడించింది. 'నేను మరాఠీ అమ్మాయిని అయినా భోజ్ పురి (పశ్చిమ బీహార్ లో ప్రజలు మాట్లాడే భాష) సినిమాలో నటించా. కనుక మరాఠీ, బీహారీల మధ్య ఎలాంటి భేదభావం లేదు' అని ఆమె అన్నారు.

  • Loading...

More Telugu News