: గిన్నిస్ రికార్డు సంపాదించిన వడోదర మున్సిపాలిటీ
గుజరాత్ లోని వడోదర మున్సిపాలిటీ గిన్నిస్ రికార్డును సంపాదించుకొంది. నిత్యం బిజీబిజీగా గడిపే వడోదర మున్సిపల్ ఉద్యోగులు రొటీన్ కు భిన్నంగా వ్యవహరించి ఈ రికార్డును నెలకొల్పారు. వడోదర మున్సిపల్ కార్పొరేషన్ (వి.ఎం.సి) పరిధిలో కేవలం 8 గంటల వ్యవధిలో రికార్డు స్థాయిలో 8,368 మందికి బీపీ పరీక్ష నిర్వహించారు. అత్యధిక మందికి ఈ పరీక్ష నిర్వహించటంతో వీఎంసీకి ‘గిన్నిస్’ రికార్డు దక్కింది.