: టీడీపీలోకి ముగ్గురు మంత్రులు?


ముగ్గురు రాష్ట్ర మంత్రులు కాంగ్రెస్ పార్టీని వీడనున్నట్లు తెలుస్తోంది. వీరిలో కర్నూలు జిల్లాకు చెందిన టీజీ వెంకటేష్, ఏరాసు ప్రతాపరెడ్డి, విశాఖ జిల్లాకు చెందిన గంటా శ్రీనివాసరావు ఉన్నారు. టీజీ, గంటా ఒకప్పుడు టీడీపీ నేతలే. వీరిని తనవైపు రాబట్టేందుకు మాజీ సీఎం కిరణ్ ప్రయత్నించినప్పటికీ.. రాజకీయ ప్రయోజనాలు, సమీకరణాలను పరిగణనలోకి తీసుకున్న తర్వాత వీరు టీడీపీలోకి వెళ్లాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. చేరిక తర్వాత టీజీ కర్నూలు అసెంబ్లీ స్థానం నుంచి, గంటా విశాఖ లోక్ సభ స్థానం నుంచి, ఏరాసు పాణ్యం శాసనసభ స్థానం నుంచి పోటీ చేయనున్నట్లు సమాచారం వెల్లడైంది. నంద్యాల ఎమ్మెల్యే శిల్పా మోహనరెడ్డి కూడా టీడీపీలో చేరతారని తెలుస్తోంది.

  • Loading...

More Telugu News