: మరో దీక్షకు సిద్ధమవుతున్న బైరెడ్డి


రాయలసీమ పరిరక్షణ సమితి అధినేత బైరెడ్డి రాజశేఖరరెడ్డి మరో దీక్షకు నడుం బిగించారు. సీమాంధ్ర రాజధానిగా కర్నూలును ప్రకటించాలని డిమాండ్ చేస్తూ రేపటి నుంచి రెండ్రోజుల పాటు దీక్ష చేపట్టనున్నారు. రాయలసీమకు శాశ్వత స్వయం ప్రతిపత్తి కల్పించాలని కూడా బైరెడ్డి కోరారు. విభజన నేపథ్యంలో సీమకు తీరని అన్యాయం జరిగిందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పుడు పార్టీల నేతలు ఓట్ల కోసం నాటకాలు ఆడుతున్నారని విమర్శించారు. తమకు కంటితుడుపు ప్యాకేజీలు వద్దని స్పష్టం చేశారు.

  • Loading...

More Telugu News