: అవినీతి నిరోధక బిల్లులకు ఆర్డినెన్స్ లు తెస్తాం: రాహుల్


ఏఐసీసీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ అవినీతిపై పోరాటం తమ అజెండా అని స్పష్టం చేశారు. పార్లమెంటులో ఆమోదానికి నోచుకోని అవినీతి నిరోధక బిల్లులకు ఆర్డినెన్స్ లు తెస్తామని చెప్పారు. ఉత్తరాఖండ్ లోని డెహ్రాడూన్ వద్ద బహిరంగ సభలో పాల్గొన్న రాహుల్... అవినీతి నిరోధానికి కట్టుబడి ఉన్నామని ఉద్ఘాటించారు. ఎన్నికల సమయం కావడంతో ప్రతిపక్షం పెద్దపెద్ద మాటలు మాట్లాడుతోందని పరోక్షంగా మోడీనుద్దేశించి వ్యాఖ్యానించారు. గుజరాత్ లో లోకాయుక్త ఉన్నా, ఒక వ్యక్తి (మోడీ) తప్ప అందరూ దాని పరిధిలోకి వస్తారని ఎద్దేవా చేశారు. వచ్చే ఐదేళ్ళలో దేశ ప్రజలందరికి ఉచిత వైద్యసదుపాయం కల్పిస్తామని చెప్పారు.

  • Loading...

More Telugu News