: బంగ్లాదేశ్ పయనమైన టీమిండియా
ఆసియా కప్ లో పాల్గొనేందుకు టీమిండియా బంగ్లాదేశ్ పయనమైంది. తాత్కాలిక కెప్టెన్ విరాట్ కోహ్లీ నేతృత్వంలో 15 మంది సభ్యుల భారత బృందం ఈ ఉదయం ముంబయి నుంచి ఢాకా బయల్దేరింది. ఈ టోర్నీ ఎల్లుండి నుంచి బంగ్లాదేశ్ లోని పలు వేదికలపై జరగనుంది. టోర్నీలో భారత్ తన తొలి మ్యాచ్ ను ఈ నెల 26న బంగ్లాదేశ్ తో తలపడుతుంది. అనంతరం శ్రీలంకతో ఈ నెల 28న, చిరకాల ప్రత్యర్థి పాకిస్తాన్ తో మార్చి 2న, పసికూన ఆఫ్ఘనిస్తాన్ తో మార్చి 5న ఆడనుంది. టోర్నీ ఫైనల్ మార్చి 8న జరగనుంది. ఆసియా కప్ లో పాల్గొనే టీమిండియా ఇదే... కోహ్లీ (కెప్టెన్), ధావన్, రోహిత్, పుజారా, రాయుడు, రహానే, దినేశ్ కార్తీక్ (వికెట్ కీపర్), జడేజా, అశ్విన్, భువనేశ్వర్, షమి, ఆరోన్, బిన్నీ, అమిత్ మిశ్రా, ఈశ్వర్ పాండే.