: పోప్ చమత్కారం
వాటికన్ సంప్రదాయాలను కొత్త పుంతలు తొక్కిస్తున్న పోప్ ఫ్రాన్సిస్ మంచి చమత్కారి కూడా. ఇటీవలే వాటికన్ వెళ్ళిన బ్రెజిల్ అధ్యక్షురాలు దిల్మా రూసెఫ్.. పోప్ ఆతిథ్యాన్ని అందుకున్నారు. ఈ సందర్భంగా రూసెఫ్... పోప్ కు బ్రెజిల్ సాకర్ టీమ్ జెర్సీని కానుకగా అందించారు. ఫుట్ బాల్ దిగ్గజాలు పీలే, రొనాల్డోలు సంతకాలు చేసిన జెర్సీ అది. దాన్నందుకుని పోప్ ఎంతో సంబరపడిపోయారు. వెంటనే ఏమన్నాడో చూడండి, 'దేశమా, ఇంకేమన్నానా...! వచ్చే ఫీఫా వరల్డ్ కప్ లో బ్రెజిల్ కే నా మద్దతు. సొంతగడ్డ అర్జెంటీనా కన్నా బ్రెజిల్ నే బలపరుస్తా' అని సరదాగా వ్యాఖ్యానించారు. దీంతో, అక్కడ నవ్వులు విరబూశాయి.