: జాక్ పాట్ లాటరీ టిక్కెట్ అమ్మి.. అతడు 10 లక్షలు అందుకున్నాడు


జాక్ పాట్ లాటరీ టిక్కెట్ విక్రయించిన.. ఆ భారతీయ వ్యాపారి 10 లక్షల రూపాయలను అందుకున్నాడు. అమెరికాలోని లాస్ ఏంజెలెస్ నగరంలో ఆ జాక్ పాట్ లాటరీ టిక్కెట్టుకు సుమారు 42 కోట్ల రూపాయల బహుమతి లభించింది. అయితే, ఆ లాటరీ టిక్కెట్టు అమ్మినందుకు భారతీయ సంతతికి చెందిన వ్యాపారి కుల్వీందర్ సింగ్ 10 లక్షల రూపాయల ప్రోత్సాహక బహుమతి అందుకున్నాడు.

కుల్వీందర్ సింగ్ అమ్మినది మామూలు లాటరీ టిక్కెట్టు కాదు.. అందుకే, అమెరికాలోనే అత్యధిక విలువైన ‘పవర్ బాల్ జాక్ పాట్’ను కొట్టేసింది. ఈ విషయాన్ని లాటరీ నిర్వాహక సంస్థ ప్రకటించే సమయానికి కుల్వీందర్ భారత్ కు విమానంలో బయల్దేరాడు. లాటరీ సంస్థ నుంచి 10 లక్షలు వచ్చాయంటూ అతని కుమారుడు ఫోన్ ద్వారా సమాచారం అందించాడు. ఈ విషయాన్ని కుల్వీందర్ మీడియాకు ఆనందంగా వెల్లడించారు.

  • Loading...

More Telugu News