: వైఎస్ అల్లుడా.. మజాకా: ఇది బాబు కామెంట్


వైఎస్ రాజశేఖర రెడ్డి అధికారంలో ఉన్నప్పుడు కుటుంబం కోసం రాష్ట్రాన్నే దోచిపెట్టారని తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడు విమర్శించారు. వైఎస్ అండతో ఆయన అల్లుడు కూడా అందినకాడికి దోచుకున్నారని పేర్కొంటూ, 'అల్లుడా.. మజాకానా' అంటూ సభికులను నవ్వించారు. ప్రస్తుతం బాబు తూర్పు గోదావరి జిల్లాలో పాదయాత్ర సాగిస్తున్నారు.

ఈ సందర్భంగా మాట్లాడుతూ, బినామీ పెట్టుబడులతో పేదల సొమ్ము కాజేసినవాళ్ళు  ప్రస్తుతం చంచల్ గూడ జైల్లో ఊచలు లెక్కబెడుతున్నారని ఎద్దేవా చేశారు. పేదవాళ్ళకు దక్కాల్సిన సొమ్ము అవినీతి పరుల చెంతకు చేరిందని చెప్పారు. పేదలు ఎక్కడుంటే టీడీపీ అక్కడుంటుందని బాబు అన్నారు. ప్రజల కష్టాలు తీరాలంటే టీడీపీకి అధికారం ఇవ్వాలన్నారు. 

  • Loading...

More Telugu News