: తెలంగాణలో విద్యుత్ సమస్యను ఎలా పరిష్కరిస్తారు?: చంద్రబాబు


టీడీపీ అధికారంలోకి వచ్చినప్పుడు హైదరాబాదులో కూడా కరెంటు సరిగ్గా ఉండేది కాదని, ఇక గ్రామాల్లో పరిస్థితి మరింత ఘోరంగా ఉండేదని టీడీపీ అధినేత చంద్రబాబు అన్నారు. కానీ, టీడీపీ పాలనలో మిగులు విద్యుత్తును సాధించామని చెప్పారు. ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రానికి విద్యుత్ సమస్య ఉందని... దాన్ని ఎలా పరిష్కరిస్తారో కాంగ్రెస్ పార్టీ కాని, టీఆర్ఎస్ కానీ చెప్పలేదని విమర్శించారు. తెలంగాణలో ఆదాయం వచ్చిందని... ఇతర పార్టీలు పెత్తనం చెలాయించడానికి వచ్చాయని అన్నారు. ఈ రోజు టీటీడీపీ నేతలతో నిర్వహించిన విస్తృత స్థాయి సమావేశంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. గోదావరి, కృష్ణా నదుల నీటిని రెండు రాష్ట్రాలకు ఎలా పంచుతారని ప్రశ్నించారు. రాబోయే కాలంలో చిన్న కాలువ తవ్వుకోవాలన్నా కేంద్ర ప్రభుత్వాన్ని అడుక్కునే పరిస్థితి తలెత్తుతుందని అన్నారు. మరోవైపు, సీమాంధ్ర రాష్ట్రంలో జీతాలు ఇచ్చే పరిస్థితి కూడా ఉండదని ఆవేదన వ్యక్తం చేశారు.

  • Loading...

More Telugu News