: తెలంగాణ బిల్లుపై పార్లమెంటులో కాంగ్రెస్ చర్చించలేదు: సుష్మా స్వరాజ్
పార్లమెంటులో తెలంగాణ బిల్లుపై భారతీయ జనతాపార్టీ చర్చించిందని ఆ పార్టీ సీనియర్ నేత సుష్మా స్వరాజ్ చెప్పారు. తెలంగాణ బిల్లుపై సభలో కాంగ్రెస్ సభ్యులే చర్చించలేదని ఆమె ఆరోపించారు. ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ బిల్లు ఆమోదంతో తెలంగాణ ప్రజల ఆకాంక్ష నెరవేరిందని ఆమె పేర్కొన్నారు.
గడచిన లోక్ సభలో ధరల పెరుగుదలపై మూడు సార్లు చర్చ జరిగిందని సుష్మా వెల్లడించారు. రైతుల సమస్యలపై కూడా బీజేపీ లోక్ సభలో చర్చించిందని సుష్మా తెలిపారు. దేశ ప్రయోజనాలే ముఖ్యమనుకున్నప్పుడు పార్టీలకతీతంగా పనిచేశామని ఈ సందర్భంగా సుష్మా గుర్తు చేశారు. విపక్షాల విమర్శలను పట్టించుకోనప్పుడు సుప్రీంకోర్టే ప్రభుత్వాన్ని తప్పుపట్టిందని ఆమె చెప్పారు. కాగ్, సీవీసీ విషయంలోనూ కేంద్రప్రభుత్వం ఏకపక్ష ధోరణితో వ్యవహరించిందని ఆమె అన్నారు.