: లోక్ సభ ఎన్నికలకు షర్మిల ఠాగూర్?


లోక్ సభ ఎన్నికల నేపథ్యంలో గుర్గావ్ నియోజకవర్గానికి సరైన అభ్యర్థి పేరును కాంగ్రెస్ పరిశీలిస్తోంది. ఇప్పటికే అక్కడి సిట్టింగ్ ఎంపీ రావ్ ఇంద్రజిత్ సింగ్ రాజీనామా చేసి బీజేపీలో చేరారు. ఈ క్రమంలో పేరున్న వ్యక్తిని రంగంలోకి దింపి హస్తగతం చేసుకోవాలని చూస్తోంది. ఈ నేపథ్యంలో ఈ స్థానానికి ప్రముఖ బాలీవుడ్ నటి, ఫిలిం సెన్సార్ బోర్డు మాజీ చైర్ పర్సన్ షర్మిల ఠాగూర్ పేరును పరిశీలించారట. అయితే, ఈ విషయమై ఆమెను పార్టీ సంప్రదించలేదని, అనధికారికంగా ఏర్పాటుచేసిన సమావేశంలో టికెట్ ఇచ్చే విషయంపై పేరు ప్రస్తావనకు మాత్రమే వచ్చినట్లు లోక్ సభ స్క్రీనింగ్ కమిటీ ఇన్ ఛార్జ్ పీసీ చాకో పేర్కొన్నారు. తుది నిర్ణయం తీసుకోలేదని, ప్రస్తుతం ఇంకా అన్ని ప్రత్యామ్నాయాలను చూస్తున్నామనీ అన్నారు.

  • Loading...

More Telugu News