: మా అధిష్ఠానానికి కృతజ్ఞతలు: నాగం
రాష్ట్ర విభజన బిల్లు లోక్ సభ, రాజ్యసభలో ఆమోదం పొందడం, తెలంగాణ ఏర్పడబోతుండటంతో ఆనందోత్సాహంలో మునిగి తేలుతున్న బీజేపీ నేత నాగం జనార్ధన్ రెడ్డి కొద్దిసేపటికి కిందట ఢిల్లీ నుంచి శంషాబాద్ విమానాశ్రయానికి చేరుకున్నారు. ఈ సందర్భంగా మాట్లాడిన ఆయన, తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు సహకరించిన తమ అధిష్ఠానానికి కృతజ్ఞతలు తెలుపుతున్నానన్నారు. ఇకనుంచి బీజేపీతోనే తెలంగాణ అభివృద్ధి చెందుతుందని, అందుకు తమ పార్టీ కృషి చేస్తుందన్నారు. తెలంగాణతోనే తెలుగు గడ్డపై అడుగుపెడతానన్న తన వాగ్దానం నెరవేరిందని, అలానే వచ్చానని చెప్పారు. ఆ పార్టీ మరో నేత యెన్నం శ్రీనివాస్ రెడ్డి కూడా తన సంతోషాన్ని మీడియాతో పంచుకున్నారు.