: ముంపు గ్రామాలను తెలంగాణలోనే ఉంచాలంటూ ఆదివాసీల బంద్
పోలవరం ప్రాజెక్టు ముంపు గ్రామాలను తెలంగాణలోనే ఉంచాలంటూ ముంపు ప్రాంతంలోని ఆదివాసీలు ఏజెన్సీ బంద్ కు పిలుపునిచ్చారు. ఈ నేపథ్యంలో ఖమ్మం జిల్లాలోని కూనవరం మండలంలో విద్య, వ్యాపార సంస్థలను స్వచ్ఛందంగా మూసివేశారు. పాపికొండలకు వెళ్లే లాంచీలను ఆదివాసీలు అడ్డుకుంటున్నారు. దీంతో, పర్యాటకులు వెనుదిరుగుతున్నారు.