: రెండు రాష్ట్రాలకు ఒకే సెక్రటేరియట్!


ఆంధ్రప్రదేశ్ రెండు రాష్ట్రాలుగా విడిపోయిన తర్వాత పదేళ్ల పాటు హైదరాబాద్ ఉమ్మడి రాజధానిగా ఉండబోతున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ప్రభుత్వ పాలనకు కేంద్ర బిందువైన సెక్రటేరియట్ ను ఎవరికి కేటాయిస్తారనే సంశయం అందర్లోనూ నెలకొంది. కానీ, విశ్వసనీయ సమాచారం ప్రకారం, సెక్రటేరియట్ నుంచే రెండు రాష్ట్రాలు పరిపాలనను కొనసాగించబోతున్నాయి. సచివాలయంలోని 8 బ్లాకులను రెండుగా (4+4) విభజిస్తున్నారు. నాలుగు బ్లాకుల నుంచి సీమాంధ్ర, నాలుగు బ్లాకుల నుంచి తెలంగాణ రాష్ట్రాలు పరిపాలనను నిర్వహించనున్నాయి. ఈ మేరకు ఓ ప్రాథమిక నివేదికను కేంద్ర హోంశాఖకు పంపించినట్టు సమాచారం.

  • Loading...

More Telugu News