: కర్ణాటక గృహ నిర్మాణ శాఖ మంత్రి అంబరీష్ కు తీవ్ర అస్వస్థత... ఆసుపత్రిలో చేరిక
కర్ణాటక గృహ నిర్మాణ శాఖ మంత్రి, కన్నడ సీనియర్ నటుడు, సినీనటి సుమలత భర్త తీవ్ర అస్వస్థతకు లోనవడంతో నిన్న రాత్రి బెంగళూరులోని విక్రం ఆసుపత్రిలో చేరారు. దీంతో ఆసుపత్రిలోని క్రిటికల్ కేర్ యూనిట్లో డా. రంగనాధ్ నాయక్ నేతృత్వంలోని వైద్యుల బృందం చికిత్స అందించారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని, ఆందోళన చెందాల్సిన అవసరం లేదని డా. రంగనాధ్ వెల్లడించారు. కాగా ఆయన గత మూడు రోజులుగా శ్వాస సంబంధిత సమస్య, జ్వరంతో బాధపడుతున్నారు. విషయం తెలుసుకున్న మండ్య లోక్ సభ సభ్యురాలు, సినీ నటి రమ్య ఆసుపత్రికి వెళ్లి చికిత్స వివరాలను అడిగి తెలుసుకున్నారు. సమాచారం తెలుసుకున్న ఆయన అభిమానులు ఆసుపత్రి వద్దకు చేరుకుని యోగక్షేమాలను వాకబు చేస్తున్నారు.