: హైదరాబాడును మించిన రాజధాని నిర్మించగలరా?: బాబు ప్రశ్నాస్త్రం


కేంద్రానికి చంద్రబాబు పలు ప్రశ్నాస్త్రాలు సంధించారు. సీమాంధ్రకు ప్రత్యేక రాజధాని నిర్మించి ఇస్తామని చెబుతున్నారని, హైదరాబాద్ ను మించిన రాజధానిని నిర్మించి ఇవ్వగలరా? అని బాబు ప్రశ్నించారు. తాము నిర్మించబోయే రాజధాని హైదరాబాద్ ను తలదన్నేలా ఉంటుందని దిగ్విజయ్ సింగ్ అంటున్నారని, అందుకు 30 ఏళ్ళు పడుతుందో, 40, 50 ఏళ్ళు పడుతుందో తెలియదన్నారు. కొత్త రాజధాని నిర్మించాలంటే నాలుగు నుంచి ఐదు లక్షల కోట్ల రూపాయల వ్యయం అవుతుందని బాబు చెప్పారు. అత్యంత ఆధునిక మౌలిక సదుపాయాలు కల్పించాల్సి ఉంటుందని అభిప్రాయపడ్డారు. తాము హైదరాబాద్ ను ప్రపంచస్థాయికి తీసుకెళ్ళామని బాబు చెప్పారు.

  • Loading...

More Telugu News