: 23 ఏళ్లు కారాగారంలో ఉంచి... 40 కోట్ల రూపాయలు పరిహారమిచ్చారు..!


ఒకటి, రెండూ కాదు... ఏకంగా, 23 సంవత్సరాలు అతడు కారాగారంలో మగ్గిపోయాడు. ‘‘నేనే తప్పూ చేయలేదు మొర్రో’’ అని అతడు మొత్తుకున్నా పోలీసులు వినలేదు, కోర్టు పట్టించుకోలేదు. ఇంతకీ ఏ నేరం చేశాడనేగా మీ అనుమానం... కుందేలును హతమార్చాడన్న ఆరోపణతో డేవిడ్ రాంటా అనే వ్యక్తిని అమెరికా పోలీసులు అరెస్ట్ చేసి జైల్లో పెట్టారు. 1990 నుంచి జైల్లో ఉన్న డేవిడ్, ఎట్టకేలకు ఆ కుందేలును చంపలేదని తేలడంతో గత సంవత్సరం విడుదలయ్యాడు. కానీ, ఆ మర్నాడే అతడికి గుండెపోటు వచ్చింది.

వెర్జ్ బెర్గర్ అనే ఆ కుందేలు ఓ నగల దుకాణంలో 1990లో జరిగిన దోపిడీ సందర్భంగా జరిగిన కాల్పుల్లో చనిపోయింది. దాంతో పోలీసులు డేవిడ్ రాంటాను అరెస్ట్ చేసి, అతడే దోషి అంటూ న్యాయస్థానంలో గట్టిగా చెప్పారు. చివరకు ఇన్నాళ్లుగా విచారణ సాగిన కేసు ముగిసి, డేవిడ్ నిర్దోషి అని తేలడంతో విడిచిపెట్టారు. అంతే కాదు, అన్యాయంగా జైల్లో ఉంచినందుకు న్యూయార్క్ నగర కౌన్సిల్ అతడికి సుమారు 40 కోట్ల రూపాయల పరిహారాన్ని చెల్లించింది. ముందు చేతులు కాల్చుకోవడం, ఆనక ఆకులు పట్టుకోవడమంటే ఇదేనేమో!

  • Loading...

More Telugu News