: భళా ... 'ఆకాశ్' దూసుకెళ్ళింది!
భూ ఉపరితలం నుంచి ఆకాశానికి ప్రయోగించగల మధ్యమ శ్రేణి క్షిపణి ఆకాశ్ ను నేడు విజయవంతంగా పరీక్షించారు. ఒడిశాలోని చాందీపూర్ రేంజి నుంచి ఈ ఉదయం ప్రయోగించిన ఆకాశ్ మిస్సైల్.. నిర్దేశిత లక్ష్యం మానవ రహిత విమానం 'లక్ష్య'ను తుత్తునియలు చేసింది. వచ్చే రెండ్రోజుల్లో మరికొన్ని పరీక్షలు నిర్వహిస్తామని రక్షణ శాఖ తెలిపింది. యాంటీ-ఎయిర్ క్రాఫ్ట్ డిఫెన్స్ సిస్టమ్ లో భాగంగా ఈ క్షిపణిని డీఆర్ డీవో అభివృద్ధి చేసింది. దీని పరిధి 25 కిలోమీటర్లు కాగా, 60 కిలోల పేలుడు పదార్థాలను మోసుకు వెళ్ళగలదు. శత్రు యుద్ధ విమానాలను, క్రూయిజ్ మిస్సైళ్ళను ఇది మార్గమధ్యంలోనే అడ్డుకోగలదు.