: కాంగ్రెస్, బీజేపీయేతర పార్టీలతో కలసి థర్డ్ ఫ్రంట్ ఏర్పాటు: ప్రకాశ్ కారత్


కాంగ్రెస్, బీజేపీయేతర పార్టీలన్నీ కలిసి... వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో పోటీ చేస్తాయని సీపీఎం జాతీయ నేత ప్రకాశ్ కారత్ వెల్లడించారు. ఈరోజు (శుక్రవారం) యూపీలోని ముజఫర్ నగర్ లో పర్యటించిన అనంతరం కారత్ మీడియాతో మాట్లాడారు. కేంద్రంలో మతతత్వ శక్తులను అధికారంలోకి రాకుండా అడ్డుకుంటామని ఆయన అన్నారు. సమాజ్ వాది పార్టీ సహా పదకొండు రాజకీయ పార్టీలతో కలిసి ఈ నెల 25వ తేదీన ఢిల్లీలో సమావేశం నిర్వహించనున్నట్లు ఆయన తెలిపారు. థర్డ్ ఫ్రంట్ ఏర్పాటు, భవిష్యత్ కార్యాచరణపై పార్టీల నేతలంతా కలసి నిర్ణయం తీసుకుంటారని కారత్ చెప్పారు.

ముజఫర్ నగర్ అల్లర్ల బాధితులను కారత్ పరామర్శించారు. బాధితుల కోసం జొల్లా గ్రామంలో ఏక్తా కాలనీ నిర్మాణానికి ఆయన శంకుస్థాపన చేశారు. భవనాల నిర్మాణానికి పార్టీ కార్యకర్తలు, నేతల నుంచి విరాళాలు సేకరించామని ఆయన తెలిపారు.

  • Loading...

More Telugu News