: ముషారఫ్ కు ఎదురుదెబ్బ


పాకిస్తాన్ మాజీ అధ్యక్షుడు పర్వేజ్ ముషారఫ్ కు ఎదురుదెబ్బ తగిలింది. దేశద్రోహం కేసులో ఇటీవలే కోర్టు ఎదుటకు వచ్చిన ఆయనకు నేడు ఇస్లామాబాద్ న్యాయస్థానంలో నిరాశ తప్పలేదు. సైనిక చట్టాలను అనుసరించి తనపై విచారణ జరపాలన్న అతని పిటిషన్ ను కోర్టు కొట్టివేసింది. తాము ముషారఫ్ ను సాధారణ చట్టాలకు లోబడి తప్పనిసరిగా విచారించాల్సి ఉందని జస్టిస్ ఫైజల్ అరబ్ స్పష్టం చేశారు. తదుపరి విచారణలో భాగంగా ముషారఫ్ మార్చి 11న కోర్టుకు హాజరు కావాల్సి ఉంటుందని ఆదేశించారు. ముషారఫ్ తాను అధికారంలో ఉన్నప్పుడు రాజ్యాంగాన్ని రద్దు చేయడమే కాకుండా, జడ్జిలను నిర్బంధంలోకి తీసుకున్నట్టు ప్రస్తుతం అభియోగాలను ఎదుర్కొంటున్నాడు.

  • Loading...

More Telugu News