: టీవీ లైవ్ షోలో చెంపదెబ్బలాట
ఆమ్ ఆద్మీ పార్టీ ప్రతినిధి ఇజాజ్ ఖాన్ కు ఊహించని పరాభవం ఎదురైంది. ఇండియా న్యూస్ చానల్ లో 'అరవింద్ కేజ్రీవాల్ కూడా కుల రాజకీయాలను అనుసరిస్తున్నారా?' అన్న అంశంపై చర్చ నడుస్తోంది. ఆమ్ ఆద్మీ పార్టీ ప్రతినిధి ఇజాజ్ ఖాన్, ఆ పార్టీ మాజీ సభ్యురాలు టీనాశర్మ మధ్య తీవ్ర మాటల యుద్ధం జరిగింది. టీనాకు క్షమాపణ చెప్పాలని న్యూస్ యాంకర్ ఇజాజ్ ఖాన్ ను కోరింది. కానీ ఆయన తిరస్కరించాడు. దాంతో టీనా తన పక్క సీటులోనే కూర్చున్న ఇజాజ్ చెంప చెళ్లుమనిపించింది.