: తెలంగాణ ఏర్పడిన తర్వాత అసలు సమస్యలు ఎదురవుతాయి: ఈటెల
తెలంగాణ రాష్ట్రం ఏర్పాటయిన తర్వాత అసలైన సమస్యలు ఎదురవుతాయని... వాటిని ధైర్యంగా ఎదుర్కొని ముందుకు పోవాలని టీఆర్ఎస్ నేత ఈటెల రాజేందర్ అన్నారు. సమస్యల సాధన బాధ్యత తెలంగాణలోని ప్రతి ఒక్కరిపై ఉందని చెప్పారు. కేసీఆర్ పోరాటం వల్లే తెలంగాణ రాష్ట్రం ఏర్పడిందని వెల్లడించారు. ఈ రోజు ఢిల్లీలో మీడియాతో మాట్లాడుతూ, ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ పునర్నిర్మాణంలో టీఆర్ఎస్ కీలకపాత్ర పోషిస్తుందని ఈ సందర్భంగా ఆయన తెలిపారు.