: ఆసియాకప్ నుంచి ధోనీ ఔట్.. విమర్శకులకు చాన్స్ ఇవ్వకూడదనేనా?


ఈ నెల 25 నుంచి బంగ్లాదేశ్ లో జరగనున్న ఆసియా కప్ లో పాల్గొనే టీమిండియా నుంచి కెప్టెన్ ధోనీ వైదొలిగాడు. గాయం కారణంగా ధోనీ తప్పుకుంటున్నట్టు బీసీసీఐ కార్యదర్శి సంజయ్ పటేల్ ఓ ప్రకటనలో తెలిపారు. ధోనీ స్థానంలో విరాట్ కోహ్లీ జట్టు పగ్గాలు చేపడతాడని వెల్లడించారు. ధోనీ గైర్హాజరీతో వికెట్ కీపర్ గా దినేశ్ కార్తీక్ ను ఎంపిక చేశారు. కాగా, న్యూజిలాండ్ తో రెండో టెస్టు సందర్భంగా ధోనీకి గాయమైందని బీసీసీఐ వర్గాలు అంటున్నాయి. కానీ, ఆ పర్యటనలో దారుణ ఓటముల అనంతరం విమర్శకులు ఈ జార్ఖండ్ డైనమైట్ ను లక్ష్యంగా చేసుకున్నారు. అతడిని టెస్టు కెప్టెన్సీ నుంచి తప్పించాలని వ్యాఖ్యానించారు.

ఇలాంటి పరిస్థితుల్లో ఆసియాకప్ కు వెళ్ళి, అక్కడ కూడా భంగపడితే, వరల్డ్ కప్ ప్రణాళికకే ఎసరు వస్తుందని ధోనీ ఆలోచన.. అందుకే, గాయం పేరిట జట్టు నుంచి తప్పుకుని ఉంటాడని క్రికెట్ వర్గాలంటున్నాయి. ఏదేమైనా, యంగ్ స్టార్ కోహ్లీకి మరో చక్కని అవకాశం. ఇప్పటికే తన నాయకత్వ లక్షణాలను పలు వేదికలపై చాటిన ఈ ఢిల్లీ కుర్రాడికి ఆసియా కప్ తో కెప్టెన్ గా మరింత రాటుదేలే అవకాశం దక్కింది.

  • Loading...

More Telugu News