: ఇక నుంచి 'జైహింద్' అని పలకరించుకుందాం!


జైహింద్.. దేశభక్తి ఉట్టిపడే ఆ పదం ఇక నుంచి ప్రతినోటా వినపడుతుంటే భారతీయత నరనరానా ఉప్పొంగుతున్న భావన కలగడం ఖాయం. మాజీ ఎన్నికల కమిషనర్ జీవీజీ కృష్ణ మూర్తి తాజాగా ఓ ప్రతిపాదన చేశారు. దేశంలోని ప్రజలందరూ బహిరంగ ప్రదేశాల్లో పరస్పరం ఎదురైనప్పుడు.. రాజకీయ నాయకులు, అధికార గణం అందరూ ఇక నుంచి 'జైహింద్' అంటూ అభివాదం చేసుకోవాలని ఆయన ఆకాంక్షిస్తున్నారు. ఈమేరకు జీవీజీ.. రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీకి ఓ వినతి పత్రం సమర్పించారు.

ఫ్రాన్స్, రష్యా వంటి పాశ్యాత్య దేశాల్లోనే కాకుండా పొరుగున ఉన్న నేపాల్ లో కూడా వారివారి జాతీయ నినాదంతో అభివాదం చేసుకుంటారని ఆయన పేర్కొన్నారు. కళాశాలలు, కార్యాలయాలు, కంపెనీలు, చట్ట సభలు అన్నీ 'జైహింద్' అన్న నినాదంతో కార్యకలాపాలు మొదలుపెట్టాలని జీవీజీ సూచించారు. ఇది జాతి సమైక్యతకు బాటలు పరుస్తుందని ఆయన అభిప్రాయపడ్డారు.

కాగా, భారత సైన్యంలో ర్యాంకులతో పనిలేకుండా ప్రతి ఒక్కరూ ఎదురుపడినప్పుడు 'జైహింద్' అనే అభివాదం చేయాలని లెఫ్టినెంట్ జనరల్ అనిల్ మాలిక్ ఆర్నెల్ల కిందట ఉత్తర్వులు జారీ చేశారు. ఈ ఉత్తర్వుల ప్రకారం సైనిక సమావేశాలు, ఇతర కార్యక్రమాలు ముగిసిన పిమ్మట 'భారత్ మాతాకి జై' అని మూడుసార్లు నినదించాలి. 

  • Loading...

More Telugu News